శ్రీ రంగనాయకులస్వామి వేలం పాట
టెంకాయల విక్రయం, లడ్డు, పులిహోర వేలంలో రూ.లక్ష 30వేల ఆదాయం
జడ్చర్ల రూరల్, జులై 17 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని పెద్దగుట్టలో స్వయంభూగా వెలసిన శ్రీరంగనాయకులస్వామి శ్రావణ మాసంలో ఉన్న స్వామి వారి ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టెండర్ గురువారం ఓపెన్ టెండర్ జరిగింది. వేలంలో
15 మంది ఉన్నారు. గత ఏడాది 93 వేలు పలికిన వేలం, ఈ ఏడాది రూ. రూ. లక్ష 30వేలం పలికింది. ప్రధానంగా లడ్డు, పులిహోర టెండర్ ను ఏడ్ల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి 80వేలకు దక్కించుకున్నారు. టెంకాయలు, థై బజార్ టెండర్ ను కట్ట మురళిముదిరాజ్ రూ 51వేలకు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది కంటే రూ 38 వేలు మాత్రమే అధికంగా వచ్చింది. టెండర్ దక్కించుకున్న వారికి శ్రావణ మాసం ప్రారంభం నుంచి టెంకాయల విక్రయం, ప్రసాద విక్రయం అమలులోకి వస్తుందని శ్రీ రంగనాయకులస్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు కాల్వ రాధికరంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి. మురళి, కౌన్సిలర్ ఉమాశంకర్ గౌడ్, జైపాల్ రెడ్డి, జి.సత్యం, ఎడ్ల రవిగౌడ్, వెంకటేష్, అంజిబాబు, వార్ల అనిత, కాల్వ రాధిక, విజయ్, విట్టల సంతోష్, జరిగింది.