జిల్లా వ్యవసాయ అధికారిగా యశ్వంత్ రావు

 నాగర్ కర్నూల్ జిల్లా వ్యవసాయ అధికారిగా యశ్వంత్ రావు

నాగర్ కర్నూల్, జులై 14 (మనఊరు ప్రతినిధి): జిల్లా వ్యవసాయ అధికారిగా యన్. యశ్వంత్ రావును నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇన్‌చార్జిగా పనిచేస్తున్న యం. చంద్ర శేఖర్ తిరిగి అచ్చంపేటకు ఏడీఏగా నియమించింది. యన్. యశ్వంత్ రావు నిర్మల్ జిల్లా పిడి ఆత్మ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించి బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన యన్. యశ్వంత్ రావు మాట్లాడుతూ లాభసాటి వ్యవసాయంలో డీలర్ల పాత్ర ఎంతో కీలకమని, రైతులు ఏ మందులు ఎలా వాడాలి, విత్తన నాణ్యత ఎలా ఉండాలి, పురుగులు, తెగుళ్ల నివారణకు ఏం చేయాలనే అంశాలతో పాటు మట్టి సేకరణ, భూసార పరీక్షల నిర్వహణపై శిక్షణ ఇస్తామన్నారు. నాణ్యమైన విత్తనాలు అందించి రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేద్దామని కోరారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన అధికారులు.

Previous Post Next Post