*టీచర్ల పెండింగ్ బకాయిలు విడుదలలో తాత్సారం చేస్తే సహించేది లేదు*
- *పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి*
దేవరకద్ర, జూలై 14 (మనఊరు ప్రతినిధి): సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిల విడుదలలో తాత్సారం చేస్తే ఏ మాత్రం సహించేది లేదని పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పి ఆర్ టి యు టి ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం దేవరకద్రలోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలు, యు పి ఎస్ గుడి బండ, పి. ఎస్.మీనుగోని పల్లి, కె జి బి వి విద్యాలయాల్లో నిర్వహించిన పి ఆర్ టి యు టి ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సుధాకర్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు బుచ్చా రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు లయన్ అశ్విని చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, దేవరకద్ర, కౌకుంట్ల మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘు వర్ధన్ రెడ్డి, పురెంధర్ రెడ్డి, జి.శ్రీకాంత్ యాదవ్, మొయిన్ లు ఆయా పాఠశాలల హెచ్ యం లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశాల్లో పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయు లకు సంబంధించి మెడికల్, సరెండర్, జి పి ఎఫ్ తదితర పెండింగ్ బకాయిలు సత్వరమే చెల్లించాలని, బదిలీలు, పదోన్నతులతో కూడిన షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం పై పి ఆర్ టి యు రాష్ట్ర నాయకత్వం పెద్ద స్థాయిలో ఒత్తిడి పెంచినట్లు తెలిపారు. ఈ విషయంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
*సమస్యల సాధనయే లక్ష్యం*
జిల్లా గౌరవ అధ్యక్షులు బుచ్చా రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల సాధనయే ఏకైక లక్ష్యంగా పి ఆర్ టి యు పనిచేస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి సంబంధించి అనేక జి.ఓ లు సాధించిన ఘనత పి ఆర్ టి యు కే దక్కుతుందని అన్నారు.
*పి ఆర్ టి యు లో సభ్యత్వం ఒక వరం*
పి ఆర్ టి యు టి ఎస్ లో సభ్యత్వం ఉపాధ్యాయులకు ఒక గొప్ప వరమని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు లయన్ అశ్విని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద ఉపాధ్యాయ సంఘమైన పి ఆర్ టి యు అను నిత్యం ఉపాధ్యాయుల సంక్షేమమే ఊపిరిగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు లయన్ అశ్విని చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, దేవరకద్ర, కౌకుంట్ల మండలాల బాధ్యులు రఘువర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, పురెందర్ రెడ్డి, మొయిన్ తదితరులు పాల్గొన్నారు.