ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్‌ఆర్‌

 ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్‌ఆర్‌

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి


జడ్చర్ల రూరల్, జులై 8 (మనఊరు ప్రతినిధి): వైఎస్‌ఆర్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన 76వ జయంతి సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ప్రజాప్రయోజన పథకాలు కోట్లాది మందికి మేలు చేశాయనీ, ప్రతి నాయకుడు వైయస్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మినాజ్, మళిక్ షాఖీర్, కాజ, బుక్క వెంకటేశం, బుర్ల వెంకటయ్య, ఎర్ర ఆనంద్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post