అటామనస్ గా సాహిత్య డిగ్రీ కళాశాల

 అటామనస్ గా సాహిత్య డిగ్రీ కళాశాల

అధ్యాపకులు,విద్యార్థులు ఘనంగా సంబరాలు

పల్లె ప్రాంతాల విద్యాభివృద్ధిలో ఘన విజయబెరి మోగించిన సాహిత్య డిగ్రీ కళాశాల

అటానమస్ హోదా దక్కడం చాలా సంతోషం--

పేద విద్యార్థుల అభ్యున్నతే మా లక్ష్యం

 డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంజీవరెడ్డి, డైరెక్టర్ సాయిరామ్ రెడ్డి



మైదుకూరు, జులై 8 (మనఊరు ప్రతినిధి): సాహిత్య డిగ్రీ కళాశాల అరుదైన అవకాశాన్ని అందుకుంది. ఈ విద్యా సంవత్సరంలో అటానమస్ హోదా దక్కించుకుంది. తద్వారా కళాశాల పురోగతి సాధించనుంది. స్వయం ప్రతిపత్తి హోదా రావడంతో అనేక విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట పట్టణంలోని సాహిత్య డిగ్రీ కళాశాలకు అటామనస్ గుర్తింపు లభించిందని ప్రిన్సిపల్ సంజీవరెడ్డి, డైరెక్టర్ సాయిరామిరెడ్డిలు మంగళవారం తెలిపారు. సాహిత్య డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా రావడంతో యాజమాన్యానికి అధ్యాపకులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బాణసంచారాలు పేల్చి, సన్మానాలు చేసి, కేక్ కటింగ్ చేసి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాయిరాంరెడ్డి, సంజీవరెడ్డిలు మాట్లాడుతూ ఖాజీపేట పరిసర ప్రాంతాల్లోని పేద విద్యార్థుల అభ్యున్నతకై 2013లో సాహిత్య డిగ్రీ కళాశాలను ప్రారంభించామన్నారు. ఖాజీపేట పరిసర ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దల సహకారంతో అనతి కాలంలోనే అభివృద్ధి చెందుతూ సొంత భవనాన్ని ఏర్పాటు చేశామన్నారు. 2025 జనవరిలో న్యాక్ బృందం కళాశాలను సందర్శించి బి ప్లస్ గుర్తింపు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కళాశాలకు అటామనస్ గుర్తింపు కూడా లభించిందని తెలిపారు. కళాశాల అభివృద్ధికి సహకరించిన అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యోగివేమన యూనివర్సిటీ అధికారుల సహకారం, ఖాజీపేట ప్రాంత ప్రజా ప్రతినిధుల తోడ్పాటు మరువరానిదని వారు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కూడా కళాశాలను ఆదరించాలని కోరారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ భూమి రెడ్డి రవికళ్యాణ్ ఉపాధ్యాయ బృందంతో సన్మానించి వారు మాట్లాడుతూఅన్ని సౌకర్యాలతో నియోజకవర్గస్థాయిలో వేలమంది పేద విద్యార్థులకు అవకాశం కల్పించిన సాహిత్య డిగ్రీ కళాశాల యాజమాన్యం పల్లె ప్రాంతాల విద్యాభివృద్ధిలో ఘన విజయబెరి ముగించింది సాహిత్య డిగ్రీ కళాశాలనేని

 కళాశాల అభివృద్ధిలో విద్యార్థులకు క్రీడలు మరియు ఎన్ఎస్ఎస్ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు,విద్యాప్రోత్సహకాలు ప్రొఫెషనల్ కోచింగ్, బ్యాంకింగ్ పరీక్షలకుకెరియర్, మార్గదర్శకత్వం బాగా అమర్చబడిన లైబ్రరీ సౌకర్యాలు బిజినెస్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ మరియు లాంగ్వేజ్ లాబ్లు, జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలు, విద్యార్థులకు ప్లేస్మెంట్ సౌకర్యాలు వర్క్ షాప్ సెమినార్ వంటి ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యాలు, సహ పాఠ్య పాఠ్యకేతర కార్యకలాపాలు, కెరియర్ మార్గదర్శకత్వం మరియు కౌన్సిలింగ్, అధిక భద్రత మరియు సీసీటీవీ పర్యవేక్షణలోనిగా పారిశ్రామిక సందర్శనలు, స్టాఫ్ స్కిల్స్, టాలీ యోగాలో సర్టిఫైడ్ కోర్సులు, ర్యాగింగ్ ను నియంత్రిస్తూ మానసిక వత్తుల నుండి అవగాహన క్లాసులను పెంచుతూ విహారయాత్రల వంటి అనేక కార్యక్రమాలతో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని నైతిక విలువలను అభ్యున్నతిని పెంచడం కళాశాల ముందుకు వెళుతుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.

Previous Post Next Post