పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జడ్చర్ల రూరల్, జులై 13 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని దయానంద విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో 2007- 2008 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాధిమీ శివకుమార్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి గత స్మృతులను, జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం అభినందనలు తెలిపారు. ఒకరినొకరు పలుకరించుకుంటూ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులకు పూలమాలలు, శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద ఉపన్యాసాలు, భజనలు నృత్య ప్రదర్శనలు చేయడం జరిగినది. యజ్ఞం నిర్వహించారు. ఆశీర్వచనం చేయడం జరిగినది. పూర్వ విద్యార్థులు గురువులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఫోటోలు దిగి మధుర స్ర్ముతులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థులంతా ఇలా కలుసుకోవడం వల్ల స్నేహాలు బలపడతాయని తెలిపారు. పూర్వపు హెచ్ఎం కృష్ణయ్య మాట్లాడుతూ తాము విద్యాబుద్ధులు నేర్పిన చిన్నారులు తమను గుర్తించుకుని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సత్కరించడం మరపురానిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు హెచ్ఎం డ్యాసమోని కృష్ణయ్య, జయప్రకాష్, జి. శివాజీ, ప్రశాంత్, రాజేందర్, రత్నమాలటీ, ఉష టీచర్, శారద టీచర్, రామేశ్వర్, పూర్వ విద్యార్థులు శివశంకర్, రామకృష్ణ, బాల నాగేందర్, పి. లావణ్య, జోష్ణ దేవి, సౌజన్య, జ్యోతి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.