దళిత అసెంబ్లీలు, గ్రామ పంచాయతీలు ప్రకటించాలి

 దళిత అసెంబ్లీలు, గ్రామ పంచాయతీలు ప్రకటించాలి

దళిత లీడర్షిప్ పొర్ము (డిఎల్ పి) ఫౌండర్ లెల్లె సురేష్



జడ్చర్ల రూరల్, జులై 13 (మన ఊరు ప్రతినిధి): స్వతంత్ర భారతదేశంలో సామాజిక, రాజకీయ ప్రజాస్వామ్యం దళిత అసెంబ్లీలు, గ్రామ పంచాయతీలు ప్రకటించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భావించారని, దళితుల సాంఘిక విముక్తికి, ఆర్థిక పురోగతికి సెపరేట్ సెటిల్మెంట్లు ఏర్పాటు చేయాలని ఆ మహనీయుడు డిమాండ్ చేశాని దళిత లీడర్షిప్ పొర్ము (డిఎల్ పి) ఫౌండర్ లెల్లె సురేష్, పాలడుగు శ్రీనివాస్, మేరీ మాదిగ అంబేద్కర్ లు తెలిపారు. పట్టణంలోని డా.బి.ఆర్. అంబేద్కర్ కళాభవనంలో ఆదివారం ఉమ్మడి జిల్లా దళిత నాయకత్వ సమావేశానికి దళిత లీడర్షిప్ పొర్ము (డిఎల్ పి) వస్పుల ప్రవీణ్ కుమార్ అధ్యక్షుతన నిర్వహించారు. దళిత నాయకత్వ వేదిక దళిత అసెంబ్లీలు, గ్రామ పంచాయతీలు దళిత లీడర్స్ ఇప్పుడు మనం స్పష్టమైన దిశ, సమిష్టి స్ఫూర్తితో అడుగు తెలంగాణ రాష్ట్రంలో దళిత జన సమాజంలోకి తీసుకెళ్లి, తద్వారా మన జనంలో దళిత రాజకీయ చైతన్యాన్ని పెంపొందించాలి. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా రాజకీయ వేదికలలో దళితుల ఉనికి పెరిగిందన్నారు. దళిత రాజకీయ అధికార గొంతుగా మారలేదు. చాలా మటుకు రాజకీయ పార్టీలు దళిత నాయకులను కేవలం నామమాత్ర ప్రాతినిధ్యానికి పరిమితం చేశాయి. ఇప్పటికీ చేస్తున్నాయి. ఏ పార్టీలో కూడా దళితులు నిర్ణయాత్మక స్థానాల్లో లేరు. దళిత అభ్యర్ధులు. ఎన్నికల్లో సీటు పొందాలన్నా, ఆ తర్వాత గెలవాలన్నా అగ్ర కులాల దయాదాక్షిణ్యాలు కావాలి. వాళ్ళకు నచ్చేలా నడుచుకోవాలి. ఈ పద్దతి దళిత సమాజ అభివృద్ధికోసం పనిచేయాల్సిన దళిత నాయకులను అగ్రకుల నాయకుల ఆశీర్వాదాలకోసం ఆరాటపడేలా చేస్తుంది. ఈ పరిస్థితి నిజాయితీగల దళిత నాయకులను, దళిత నాయకులుగా ఎదగాలనే ఆశయంతో ఉన్న దళిత ఆశావాహులను అయోమయ స్థితిలోకి నెట్టివేస్తోంది. ఈ కార్యక్రమంలో దళిత లీడర్షిప్ పొర్ము (డిఎల్ పి) డిలీఫ్, కోళ్ల వెంకటేష్, కొమ్ము తిరుపతి, జి.సుధాకర్, ఎర్ర ఆనంద్, గొప్లపూర్ యాదయ్య, లీడర్ శ్రీను, ప్రమోద్ మహాజన్, బాలయ్య, శ్రీనివాస్ బహుదుర్, రమేష్ బహుదుర్, బంబే మహేష్, యు ఆనంద్, అకుపోగు ప్రమోద్, హారి బాబు, భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. 

Previous Post Next Post