యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి
బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతి
కేశంపేట, జులై 11 (మనఊరు ప్రతినిధి): యువత వ్యాపార రంగంలో రాణించేందుకు శ్రమించాలని, స్వయం ఉపాధి రంగాలలో రాణించి ఆర్థికంగా ఎదగాలని కేశంపేట మండల బీజేపీ సీనియర్ నాయకులు కల్వాకొలు తిరుపతి అన్నారు. మండల పరిధిలోని తొమ్మిది రేకుల గ్రామంలో గ్రామ యువకుడు కల్వకొల్ రాఘవేందర్ మరియుకల్వకోలు నరేష్ కు చెందిన అంబా పరమేశ్వరి టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ సమయాన్ని వృథా చేసుకోకుండా స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని సూచించారు. ఉపాధి పొందడంతో పాటు మరోనలుగురుకి ఉపాధి చూపించిన వారు అవుతారని అన్నారు.యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అవినాష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ చిట్టిరెడ్డి నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ యాదయ్య, నాయకులు బాలరాజు గౌడ్, చిట్టి రెడ్డి వెంకట్ రెడ్డి, లాలమోని చంద్రయ్య, వెంకటేష్, పోగుల నర్సింలు, చిట్టిరెడ్డి రామిరెడ్డి, పోగుల నరేష్, కల్వకోలు నిరంజన్, కాజా అలీ, మల్లేష్, చెన్నయ్య, తిరుపతిరెడ్డి, కందెన చందు, ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.