పాత గోడలకు కొత్త సున్నాలు

 పాత గోడలకు కొత్త సున్నాలు

ప్రారంభోత్సవాలకే పరిమితమా - పనులు ఎప్పుడు మొదలవుతాయి

బిఆర్ఎస్వి కల్వకుర్తి అధ్యక్షులు గణేష్ 



కల్వకుర్తి, జులై 11 (మనఊరు ప్రతినిధి): బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లోనే అప్పటి మంత్రి, ప్రస్తుత మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా భూమి పూజ, శంకుస్థాపన చేసిన కల్వకుర్తి 100 పడకల ఆసుపత్రి మళ్లీ ఈరోజు రెండవసారి శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని, ప్రజలు పాత గోడలకు కొత్త సున్నాలంటూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారని బిఆర్ఎస్వి కల్వకుర్తి అధ్యక్షులు దారమోని గణేష్ అన్నారు. 2023 సంవత్సరంలోనే 17.5 లక్షల పరిపాలన అనుమతులు కూడా వంద పడకల ఆసుపత్రి కోసం అనుమతులు లభించాయని కల్వకుర్తి లోని డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పక్కన ఉన్న 99 సర్వేలో ఆసుపత్రి నిర్మాణం కోసం 366 జీవో కూడా విడుదల చేశారని గణేష్ గుర్తుచేశారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న ఇప్పటివరకు శంకుస్థాపన చేసిన 100 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించకపోగా పైగా మళ్లీ ప్రారంభోత్సవాలు చేయడం ఏంటని గణేష్ ఎద్దేవా చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం చుట్టూ మూడు జాతీయ రహదారులున్న ఇప్పటికీ సరైన వసతులతో పెద్ద ఆసుపత్రి లేకపోవడం వల్ల చాలా మంది మృతి చెందారు. అత్యవసర పరిస్థితుల్లో అందగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు రోగులు తీసుకొని వెళ్తున్నారని, వైద్య సేవలు సరిగ్గా అందక చాలా మంది ప్రాణాలు మార్గం మధ్యలోనే పోయాయని మూడు జాతీయ రహదారులున్న 100 పడకల ఆసుపత్రి ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతగానితనానికి నిదర్శనమని, ఇక నైనా ప్రారంభోత్సవాలు పక్కకు పెట్టి పనులు మొదలు పెట్టాలని దారమోని గణేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, శేఖర్ ,పెరుమాల కృష్ణ, నాగరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post