పెద్దలను దోచి పేదలకు పంచిన మహానీయుడు పండుగ సాయన్న

 పెద్దలను దోచి పేదలకు పంచిన మహానీయుడు పండుగ సాయన్న

 జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల నర్సింలు ముదిరాజ్ 


మహబూబ్నగర్ జులై 17 (మన ఊరు ప్రతినిధి ): ఉన్నోళ్లను దోచి పేదల కడుపు నింపిన మహానీయుడు పండుగ సాయన్న అని జిల్లా ఉపాధ్యక్షులు భక్తుల నరసింహ ముదిరాజ్  కొనియాడారు. తెలంగాణ రాబిన్ హూ డ్ పండుగ సాయన్న జయంతి వేడుకలను ఇవాళ గురువారం నాడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నిజాం కాలంలోనే ఉన్న వాళ్లను దోచి పేదోళ్లకు పెంచిన బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ పండుగ సాయన్న అన్నారు. కేవలం ఒక ముదిరాజ్ వర్గానికే కాకుండా ముదిరాజ్ బిడ్డగా ఆయన పేదల కష్టాలు తెలిసి ఉన్నవాళ్ల గడీలను బద్దలు కొట్టి పేదలకు పంచిపెట్టిన మహనీయుడని కొనియాడారు. అలాంటి మహనీయుడి చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. పాఠ్యపుస్తకాల్లో పండుగ సాయన్న జీవిత చరిత్రను పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పండుగ సాయన్న సమితి అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, తెలుగు సత్తా మనది ఎడిటర్ గూడెం ఆశన్న, మాజీ కౌన్సిలర్ గంజి లక్ష్మీదేవి,

జడ్చర్ల నియోజకవర్గం కమిటీ సభ్యులు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల నర్సి ములు ముదిరాజ్, జడ్చర్ల తాలూకా అధ్యక్షులు గుండెమోని శేఖర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు సున్నపు  లక్ష్మయ్య ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి  పోలమొని రవి ముదిరాజ్, తాలూకా నాయకుడు గోనెల రాధాకృష్ణ ముదిరాజ్, జడ్చర్ల మండల అధ్యక్షులు చికూరి శేఖర్ ముదిరాజ్, జడ్చర్ల టౌన్ అధ్యక్షులు కొ లిశాంతయ్య ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి పద్మ కృష్ణ, ముదిరాజ్, నాయకుడు రమేష్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి  కంచనపల్లి చెన్నయ్య ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post