స్పోర్ట్స్ స్కూల్ కు ఎంపికైన ఆద్య

 స్పోర్ట్స్ స్కూల్ కు ఎంపికైన ఆద్య

చౌడపూర్, జూలై 17 (మనఊరు ప్రతినిధి): స్పోర్ట్‌ స్కూల్‌ ప్రవేశానికి మండలంలోని మరికల్ ఎంపీపీఎస్ పాఠశాలకు చెందిన 4వ తరగతి చదువుతున్న పి. ఆద్య ఎంపికైనట్లు గురువారం పాఠశాల హెచ్ఎం నారాయణ తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరిగినటువంటి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ లో భాగంగా మండల స్థాయి, జిల్లా స్థాయి, చివరికి రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సెలక్షన్ లో పాల్గొని  స్పోర్ట్స్ స్కూల్ కు ఎంపిక కావడం జరిగింది. స్పోర్ట్స్ స్కూల్ కు సెలెక్ట్ అయిన మరికల్ ప్రాథమిక పాఠశాల విద్యార్ధినీ ఆధ్యను పాఠశాల ఉపాధ్యాయులు అయ్యూబ్, గంగాపురి, మంజుల పాండు రంగయ్యచారి, తల్లిదండ్రులు, గ్రామస్తులు, అభినందించారు.

Previous Post Next Post