కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

 కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి 

వైరా మునిసిపల్ మున్సిపల్ కమీషనర్ సి.ఎచ్. వేణు






ఖమ్మం, జులై 29 (మనఊరు ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని వైరా మునిసిపల్ మున్సిపల్ కమీషనర్ సి.ఎచ్. వేణు అన్నారు. మున్సిపల్ పరిధిలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ మీటింగ్ హాల్ లో చెత్త ఏరుకొనే వారికి నమస్తే పధకంపై నవజీవన్ స్వచ్చంద సంస్థ ఆద్వర్యములో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమస్తే (నేషనల్ యాక్షన్ ఫర్ మెకానైస్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్) పధకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్ధిక పరిపుష్టి సాధించాలని తెలిపారు. వైరా పట్టణ పారిశుధ్యములో స్వచ్చంద భాగస్వామ్యులుగా ఉన్న సుమారు 200 మంది చెత్త సేకరించే పేదలు నమస్తే పధకంతో లబ్దిపొందాలని కోరారు. నవజీవన్ జిల్లా కో-ఆర్దినేటర్ డాక్టర్ పి .లక్ష్మి కాంతం మాట్లాడుతూ నమస్తే క్రింద చెత్త ఏరుకునే వారు, నిరుపయోగ కార్టన్లు, స్క్రాప్ కోనుగోలు చేసే వారు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వారికి కేంద్ర ప్రభుత్వ నమస్తే పధకం క్రింద పావల వడ్డీకి రూ 5 లక్షల ఋణసౌకర్యం, ఆయుష్మాన్ భారత్ క్రింద రూ.5 లక్షల వరకు వైద్యానికి చేయూత, 60 ఏళ్ళు పూర్తి చేసుకొన్న వృద్ధులకు పెన్షన్ సౌకర్యం ఉంటుందని, అదే విధంగా పిల్లలకు విద్యా సౌకర్యం ఉంటుందని తెలుపుతూ నమస్తే పధకాన్ని వివరించారు. నమస్తే పధకాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాలు బాగు చేసుకోవాలని మెప్మా టిఎంసి బండారుపల్లి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్విరాన్'మెంట్ ఇంజనీర్ బి. వెంకట్రావు, మెప్మా కంప్యూటర్ ఆపరేటర్ రామకృష్ణ, సర్వేయర్లు శ్రవణ్, జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు.

Previous Post Next Post