* బంగారు మైసమ్మ దేవాలయంలో ...*
*నాగుల పంచమి వేడుకలు*
*భక్తిశ్రద్ధలతో మహిళలు పాలు పోసి నాగులకు ప్రత్యేక పూజలు*
జడ్చర్ల రూరల్, జులై 29 (మనఊరు ప్రతినిధి): నాగుల పంచమి పురస్కరించుకొని పట్టణంలోని చైతన్య నగర్ బంగారు మైసమ్మ దేవాలయంలో మంగళవారం ఘనంగా పూజా కార్యక్రమం జరిగింది. జరిగింది. మహిళలు ఉత్సాహంగా పాల్గొని నాగుల విగ్రహాలకు పాలు పోసి పూజలు చేశారు. మొదటగా దేవాలయ అర్చకులు బంగారు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగులకు పాలు పోసి, పూలతో అలంకరించి పూర్ణ ఆరాధనలు చేశారు. “మమ్ము చల్లగా చూసి మా కోర్కెలు తీర్చమ్మ” అంటూ నామస్మరణతో వేడుకుంటూ భక్తులు తమ అభీష్టాలను మనసులో ఉంచుకొని పూజల్లో ఉంటారు. ఈ సందర్భంగా సజావుగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ సభ్యులు ముందస్తు ఏర్పాట్లను భక్తులతో కలిసి విజయవంతంగా నిర్వహించారు. వారికి భక్తులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.