స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పదోన్నతులు కల్పించాలి
సెటా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేంద్రప్రసాద్ అట్ల శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి, ఆగస్టు 3 (మనఊరు ప్రతినిధి): స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పదోన్నతులలో ఎస్.జి.టి. స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి అవకాశం కల్పించాలని సెటా రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న పి.ఆర్.టి.యు. తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల రాజేంద్రప్రసాద్, అట్ల శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బత్తుల రాజేంద్రప్రసాద్, అట్ల శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గత సంవత్సర కాలంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నప్పటికీ జాబ్ చార్ట్ ప్రభుత్వము విడుదల చేయుటలో జాప్యం జరుగుచున్నదని స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పదోన్నతులలో దాదాపుగా 50శాతంపైగా పాఠశాలలో ఖాళీగా ఉన్న దృష్ట్యా ప్రస్తుతం పని చేస్తున్న ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు కనీస సర్వీసును మినహాయింపు చేస్తూ పదోన్నతుల సీనియార్టీ లిస్టులలో చేర్చుటకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని పి.సి.సి. అధికార ప్రతినిధి, పి.ఆర్.టి.యు. తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించడం జరిగిందని స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్.జి.టి. వారికి న్యాయం చేయాలి తెలిపారు.