షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు: రూ.3 లక్షల నష్టం
జన్నారం, ఆగస్టు 17 (మనఊరు ప్రతినిధి): షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు: రూ.3 లక్షల నష్టం జన్నారం మండల కేంద్రంలోని ధర్మారం రోడ్డులో సతీష్ గౌడ్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏసీతో పాటు మంచం, బీరువాలోని బట్టలు, సామాగ్రి, డబ్బులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు మూడు లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆదివారం ఇన్చార్జి ఫైర్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.