20న తీన్మార్ మల్లన్న రాక

 * 20న జిల్లాకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాక*

*బహుజన రాజ్యాధికారమే లక్ష్యం*

బెల్లంపల్లి, ఆగస్టు 17 (మనఊరు ప్రతినిధి): బహుజన నేత ప్రశ్నించే గొంతుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ నెల 20న మంచిర్యాల జిల్లాకు రానున్నట్లు బెల్లంపల్లి ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనారిటీ పొలిటికల్ జె.ఎ.సి ఇంచార్జి శ్రీనివాస్ రాంటెంకి తెలిపారు.

చున్నం బట్టి వాడ 100ఫీట్ల రోడ్, లయన్స్ క్లబ్ లో ఉదయం 11గంటలకు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బిసి ముఖ్యమంత్రి, రానున్న స్థానిక ఎన్నికల్లో జనాభా దమాషా ప్రకారం రాజకీయ వాటా, బిసిల 42శాతం రిజర్వేషన్, యువత రాజకీయాల్లోకి రావాలనే పలు అంశాలపై ముఖ్య నేతలతో దాదాపు వెయ్యి మందికి పైగా నాయకులతో సమావేశం అవుతున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. పార్టీలకు అతీతంగా బహుజన నాయకులు, మల్లన్న అభిమానులు ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.

Previous Post Next Post