కోడుగల్ లో 3కె రన్ విజయవంతం

 *జాతీయ స్పోర్ట్స్ డే సందర్భంగా కోడుగల్ లో 3కె రన్*

క్రీడలు జీవితంలో భాగం కావాలి

 - జడ్చర్ల సీఐ కమలాకర్


జడ్చర్ల రూరల్, ఆగస్టు 29 (మనఊరు ప్రతినిధి): ప్రతి మనిషి జీవితంలో క్రీడలు దైనందిక జీవితంలో భాగం కావాలని జడ్చర్ల సీఐ కమలాకర్ అన్నారు. శుక్రవారం కోడుగల్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో జాతీయ క్రీడలు డే ను పురస్కరించుకుని పాఠశాల హెచ్‌ఎం మారేపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులకు 3కే రన్‌ కమ్‌ ర్యాలీని జెండా ఊపి శుక్రవారం జడ్చర్ల సిఐ కమలాకర్, ఎంఈవో మంజులదేవిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఉత్సాహభరితంగా పరుగులు తీయడం పాఠశాల పరిసర విశేష ఆకర్షణగా నిలిచింది. నేటి తరానికి క్రీడలు అత్యంత అవసరం. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి విద్యార్థి ప్రతిరోజూ కనీసం ఒక ఆటలోనైనా పాల్గొనాలి. క్రీడలు జీవితంలో విజయానికి మార్గం చూపుతాయి అని సీఐ కమలాకర్ అన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యానికే కాకుండా, విద్యార్థులలో క్రమశిక్షణ, పోటీ భావన, సహనశక్తి, జట్టు స్పూర్తి వంటి విలువలను పెంపొందిస్తాయి. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వడం వలన సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది ఎంఈఓ మంజుల దేవి చెప్పారు. అనంతరం 3కె రన్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సీఐ కమలాకర్ బహుమతులు, సర్టిఫికెట్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగేశ్వర్, పిడి రవికుమార్, అశోక్, ట్రైబల్ ఫేర్ ప్రిన్సిపాల్ రజిని రాగలత, గ్రామస్థులు నవీన్ రెడ్డి, సాయిరెడ్డి, మన్నన్, ఉపాధ్యాయులు షాహినాపర్వీన్, కృష్ణయ్య, అమరేందర్ రెడ్డి, స్లీవారెడ్డి, ఉమాదేవి, శశిధర్, అనసూయ, కరుణాకర్, గోవర్ధన్, శ్రీనివాస్ శెట్టి, ఆంజనేయులు, బాలచంద్రుడు మల్లికార్జునలింగం, కృష్ణ, అంజలిదేవి, తాహెర్, స్ఫూర్తి, లావణ్య విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, జరుగుతున్నాయి.











Previous Post Next Post