సైబర్ క్రైమ్, సోషల్ సెక్యూరిటీ పథకాలపై అవగాహన సదస్సులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్
జడ్చర్ల రూరల్, ఆగస్టు 29 (మనఊరు ప్రతినిధి): ప్రస్తుతం సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ పూర్తిగా అవగాహన కలిగివుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ అన్నారు. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ఆధ్వర్యంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ), తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టిజిబి) భాగస్వామ్యంతో ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మల్లెబోయినపల్లి, ఆలూరు, రాజాపూర్ గ్రామాలలో రె-కెవైసి, సైబర్ క్రైమ్ అవగాహన, సోషల్ సెక్యూరిటీ పథకాలు మరియు బ్యాంకింగ్ అంబుడ్స్‌మెంట్ పథకం పై ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్, పాన్, ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలతో రీ-కెవైసి పూర్తి చేసుకోవచ్చని తెలియజేశారు.
రీ-కెవైసి చేయకపోతే ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశం ఉందని హెచ్చరించారు.
సైబర్ క్రైమ్ అవగాహన:
డిజిటల్ లావాదేవీలలో ఓటీపి, పాస్‌వర్డ్, పిన్ వంటి రహస్య సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని అధికారులు హెచ్చరించారు.
అనుమానాస్పద ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లు లేదా లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 నంబర్ (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) కి కాల్ చేయాలని, అలాగే www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చని తెలియజేశారు.
సోషల్ సెక్యూరిటీ పథకాలు:
పిఎంజెజెబివై– వార్షిక ప్రీమియం ₹436 తో ₹2 లక్షల జీవిత బీమా.
పిఎంఎస్ బివై – వార్షిక ప్రీమియం ₹12తో ప్రమాద బీమా ₹2 లక్షలు.
ఏపివై – వృద్ధాప్యంలో కనీసం ₹1000 నుండి ₹5000 వరకు నెలవారీ పెన్షన్.
బ్యాంకింగ్ అంబుడ్స్‌మెంట్ పథకం:
బ్యాంక్ సేవలలో సమస్యలు ఎదురైనప్పుడు కస్టమర్లు ఫిర్యాదు చేసుకునే విధానం గురించి ప్రజలకు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని మల్లెబోయినపల్లి, ఆలూరు, రాజాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలలో రైతులు, మహిళా సంఘాలు, యువత మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆర్ బిఐ, ఎస్ బిఐ, టిజిబి, జిల్లా అధికారులు సమగ్రమైన సమాధానాలు వెల్లడించారు. ఈ సదస్సుల ద్వారా గ్రామీణ ప్రజల్లో ఆర్థిక సాక్షరత, డిజిటల్ భద్రత, సోషల్ సెక్యూరిటీ పథకాల ప్రాముఖ్యత, కస్టమర్ హక్కులపై అవగాహన పెంపొందించడం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబరు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఐడిడి జనరల్ మేనేజర్ ముత్యాల్ జ్ఞాన సుప్రభాత్, ఎల్ డివో లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దేబోజిత్ బరువా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు
డీజీఎమ్, ఎఫ్ఐ ఛానల్ మేనేజ్‌మెంట్ నారాయణ అవధాని, మహబూబ్‌నగర్ ఏజిఎమ్ రీజినల్ మేనేజర్, ఆర్బిఓ ఎం. రామమూర్తి, జిల్లా స్థాయి అధికారి చంద్రశేఖర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్ డి ఎం), తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టిజిబి) అధికారులు ఏ. సత్యనారాయణ, రీజినల్ మేనేజర్ గాయత్రి, బ్రాంచ్ మేనేజర్ ఏ. మహేశ్వర్ రెడ్డి, డి.ఓ (ఎఫ్ఐసి) ఫీల్డ్ ఆఫీసర్లు కె. చంద్రశేఖర్, సి. మోహన్ రెడ్డి, ఎస్‌బిఐ బ్రాంచ్ మేనేజర్లు విశాల్ కుమార్, బ్రాంచ్ మేనేజర్, బదేపల్లి బ్రాంచ్ జి.పి మల్లెబోయినపల్లి వి. అశోక్ నాయక్, బ్రాంచ్ మేనేజర్, జడ్చర్ల బ్రాంచ్ జి.పి ఆలూరు, ఆర్బిఓ మేనేజర్ బి. శ్రీరామ్, డిప్యూటీ మేనేజర్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్, శ్రీ సురేష్, యం.మధు, శ్రీకాంత్,సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.