విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు గోల్డెన్ స్టార్ బహుమతులు...

బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ చాంద్ పాషా 

జడ్చర్ల రూరల్, ఆగస్టు 15 (మనఊరు ప్రతినిధి): ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సంస్థ చైర్మన్ చాంద్ పాషా అన్నారు. శుక్రవారం మండలంలోని కొడ్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడుగల్ పాఠశాలలో స్వాతంత్ర్య వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. 6నుండి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ వారి సౌజన్యంతో ఎఫ్ఏ-1 పరీక్షలో మంచి ఫలితాలు సాధించిన 50 విద్యార్థులకు 5000 రూపాయల  విలువైన బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుకుని జీవితంలో మంచి ప్రయోజకులు కావాలని సూచించారు. బహుమతులతో పాటు గోల్డెన్ స్టార్ బ్యాడ్జ్ లను కూడా అందించారు. ఈ సందర్భంగా వారుమ్విలాడఖ్ద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో విద్యార్థులకు ఈ విధంగా బహుమతులను అందిస్తున్న సంస్థ చైర్మన్ చాంద్ పాషా కోడ్గల్ పాఠశాల  ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు షాహినాపర్వీన్, కృష్ణయ్య, అమరేందర్ రెడ్డి, స్లీవారెడ్డి, ఉమాదేవి, శశిధర్, అనసూయ, కరుణాకర్, శరణప్ప, గోవర్ధన్, శ్రీనివాస్ శెట్టి, ఆంజనేయులు, మల్లికార్జునలింగం, కృష్ణ అంజలిదేవి, తాహేర్, రవికుమార్, మదన్, స్ఫూర్తి, అశోక్ లావణ్య పాల్గొన్నారు. 



 

Previous Post Next Post