ఆసుపత్రిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు...

 ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు...

మెరుగైన ఆరోగ్య సేవలు ప్రజలకు అందించి దేశానికి తోడ్పడడం..

ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి వైద్య సూపరిండేట్ డాక్టర్ టి.ఉషారాణి

నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో శుక్రవారం నాడు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ చేసి, ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల, సమరయోధుల వీర పోరాట ఫలితమే, నేటి స్వాతంత్ర ఫలితాలని అన్నారు. 

స్వాతంత్ర సమరయోధుల వీరులను పలువురు స్మరించారు. మన పరిధిలోని ఆరోగ్య సేవలను ఈ ప్రాంత ప్రజలకు మెరుగ్గా అందించి దేశ భక్తిని, ప్రజలకు ఆరోగ్యపరంగా సేవలు అందిస్తాము అందించి, దేశానికి, సమాజ ఆరోగ్య రక్షణకు తోడ్పాటు అవుదామని అన్నారు. వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు,ఇతర ఆరోగ్య సిబ్బంది సాంస్కృతిక కార్యక్రమాలు పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ రేసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవి శంకర్ నాయక్, స్త్రీ వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ వి.నీలిమ, ప్రొఫెసర్ డాక్టర్ ఉమాకాంత్, డాక్టర్ శంకర్, డాక్టర్ అజీమ్, పరిపాలనాధికారి వసంత్ కుమార్, రామచంద్రయ్య, నర్సింగ్ ఆఫీసర్లు రాజు, కిరణ్, జ్ఞానేశ్వరి, నిర్మల, పలు విభాగాల ప్రొఫెసర్లు, వైద్యులు ఆఫీసర్లు హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరి, సెక్యూరిటీ ఇతర ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.









Previous Post Next Post