అంటూ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి

 అంటూ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి 

వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే రవికుమార్ 

నాగర్ కర్నూల్, ఆగస్టు 13 (మనఊరు ప్రతినిధి): వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రస్తుతము అంటువ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లాలోని వైద్యాధికారులకు, సిబ్బందికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్  సూచించారు. బుధవారం ఆయన ఆకస్మికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పెద్ద ముద్దునూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం కొల్లాపూర్ ను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో దోమ కాటు వ్యాధులైన డెంగ్యూ, మలేరియా చికున్ గున్యా, కలుషిత నీరు ,ఆహారం ద్వారా టైఫాయిడ్, వాంతులు నీళ్ల విరేచనాలు వ్యాపించి అవకాశం ఉన్నది, కావున గ్రామాలలో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మందులు, ల్యాబ్ టెస్టులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు ఇతర వైద్య సిబ్బందికి సూచనలు చేశారు.మొదటగా పెద్ద ముద్దునూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి హాజరు పట్టికను, మందుల నిలువలను ఇతర రికార్డులను పరిశీలించారు. ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్యాధికారికి సూచనలు చేశారు. తదనంతరం పెద్దకొత్తపల్లి మండలంలోని ఆదిరాల గ్రామంలో డెంగ్యూ కేసు గృహాన్ని సందర్శించారు. అతని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితినీ అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ కేసు ఇంటి చుట్టూ 100 ఇండ్ల వరకు నాలుగు వారాలపాటు ఆంటీ లార్వల్ ఆపరేషన్ నిర్వహించాలని ఏ .ఎన్. ఎం కు, ఆశా కార్యకర్తలకు సూచించారు. ఆదిరాల గ్రామంలో ప్రజలకు దోమలు పుట్టకుండా- కుట్టకుండా తీసుకోవలసిన నివారణ చర్యలు గురించి అవగాహన కలిగించారు. పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ నిలువలను,కోల్డ్ చైన్ మెయిన్టెనెన్స్ ను పర్యవేక్షించారు.కల్వకోల్ గ్రామంలో టీకా కరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.కొల్లాపూర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలోని ప్రతిరోజు రక్త నమోనాలను తెలంగు డయాగ్నస్టిక్ హబ్ కు పంపాలని మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వాణి, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ విజయకుమార్ అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి బాదం రాజేష్,ఇతర పర్యవేక్షణ సిబ్బంది పాల్గొన్నారు.




Previous Post Next Post