*జాతీయ పతాకం స్వతంత్ర సమరయోధుల త్యాగాలకు ప్రతీక*
మిడ్జిల్, ఆగస్టు 13 (మనఊరు ప్రతినిధి): ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి అన్నారు. మిడ్జిల్ మండల కేంద్రంలో యువ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల ఆంజనేయులు ఆధ్వర్యంలో *“హర్ ఘర్ తిరంగ్” ర్యాలీ* మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ జీ నాయకత్వంలో ప్రారంభమైన హర్ ఘర్‌తిరంగా ఉద్యమం, దేశ ఐక్యత సూత్రం, దేశభక్తి భావనతో దేశాన్ని మరింత శక్తివంతం చేసే ప్రజా ఉద్యమంగా మారింది. ఈ కార్యక్రమం అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ త్యాగం, దీక్ష, అంకితభావంతో స్వతంత్ర భారత స్వప్నాన్ని సాకారం చేయడానికి చేసిన కృషిని మనకు గుర్తు చేస్తుంది అని అన్నారు. *యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి* *ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేద్దాం దేశ భక్తిని చాటుకుంద్దా* ఈ పతాకం మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీక. యువత, పిల్లలు, మహిళలు అందరూ దేశభక్తి భావంతో ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ జీ నాయకత్వంలో ప్రారంభమైన హర్‌ఘర్‌తిరంగా ఉద్యమం, దేశ ఐక్యత సూత్రం మరియు దేశభక్తి భావనతో దేశాన్ని మరింత శక్తివంతం చేసే ప్రజా ఉద్యమంగా మారింది, అని వారు అన్నారు. *పల్లె తిరుపతి మాట్లాడుతూ* మిడ్జిల్ మండలంలో స్వతంత్ర దినోత్సవం రోజున ప్రతి గ్రామం, ప్రతి వీధి దేశభక్తి వాతావరణంతో మార్మోగాలని, అందరూ వారి వారి ఇండ్లపై జెండాలు ఎగురవేయడం ద్వారా మన జాతీయ ఐక్యతను మరింత బలపరచాలని వారు సూచించారు. ఈ కార్యక్రమం అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ త్యాగం, దీక్ష, అంకితభావంతో స్వతంత్ర భారత స్వప్నాన్ని సాకారం చేయడానికి చేసిన కృషిని మనకు గుర్తు చేస్తుంది అని అన్నారు. ప్రతి భారతీయుడు ఇంటి వద్ద జాతీయ పతాకాన్ని ఎగర వేసి, ఈ దేశభక్తి ఉత్సవంలో భాగస్వాములు కావాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాజేశ్వర్, బిజెపి మండల అధ్యక్షులు నరేష్ నాయక్, జిల్లా కాన్సిల్ మెంబెర్ లక్ష్మారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కావలి నరేందర్, జిల్లా నాయకులు మావిళ్ళ వెంకటయ్య, మండల ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు, వాసుదేవ్, నరేష్, శేఖర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి, బిజెపి మండల కార్యదర్శిలు దేవేందర్, రామకృష్ణ, యువ టౌన్ అధ్యక్షులు నవీన్, నాయకులు బండారి శివ, శివశంకర్, మల్లేష్, హరీష్, అరవింద్, యాదయ్య, కిట్టు, మహేష్, వెంకటేష్, భరత్, భాను, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.