చదువుతో పాటు సంస్కారం ముఖ్యం

 చదువుతో పాటు సంస్కారం ముఖ్యం

మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ




మిడ్జిల్, ఆగస్టు 2 (మనఊరు ప్రతినిధి): చదువుతో పాటు సంస్కారం ముఖ్యమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ అన్నారు. శనివారం వస్పుల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల నూతనంగా రూ.27 లక్షల పీఎంశ్రీ నిధులతో అదనపు తరగతి గదులు, సైన్స్ యాబ్ నిర్మాణం ప్రారంభోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి లాంచనంగా ఎంపీ డీకే. అరుణ పాల్గొనడానికి. ఎంపీ డీకే. అరుణమ్మకు విద్యార్థులకు సాధర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల విద్యతో పాటు వినయం,

సంస్కారం నేర్చుకోవాలని అప్పుడే ఉత్తమ పౌరులుగా ఎదగడానికి సాధ్యమవుతుందని చెప్పారు. సమాజంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత పాఠశాలల ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. పిల్లల చదువులకు పేదరికం అడ్డురాకూడదని పీఎం శ్రీ కింద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. చదువే చదువు గొప్ప ఆస్తి అన్నారు. మి చదువులను మి నుంచి ఎవ్వరు దొంగిలించలేరని అన్నారు. పేద పిల్లలందరూ చక్కగా చదువు కోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిర్ణయించారు. విద్యార్థులు ఒకరినొకరు గౌరవించుకోవాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను సోదరిభావంతో చూడాలని సూచించారు. పిల్లలంతా ఉన్న అవకాశాలను సద్వినియోగం చక్కగా చదువుకోవాలని అన్నారు. ఈ సమయంలో మీ పాఠశాలకు మీ ఊరికి, తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, ప్రతి విద్యార్థికి ఒక్కో రకమైన ప్రతిభ ఉంటుంది, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభాను గుర్తించి వారిని ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. విద్యార్థి దశ మళ్ళీ రాదన్నారు. ఈ ఆఫర్, సమయాన్ని, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకోండి. మేము స్కూల్ చదివే రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేవన్నారు. వచ్చే విద్యా సంవత్సరం 100 శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. వసపుల పాఠశాలకు కావాల్సిన ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను అని, సగంలో మిగిలిపోయిన షెడ్ ను పూర్తి చేసినట్లు హామీ ఇచ్చారు. జడ్చర్ల బైపాస్ కోసం ఇటీవల ఎమ్మెల్యేతో కలిసి కేంద్ర మంత్రి గాడ్కరికి ప్రతి పాదనలు ఇచ్చాం, త్వరలో డిపిఆర్ చేసి బైపాస్ ఇచ్చేలా తమవంతు కృషి చేయాలన్నారు. చేర్చారు. ఇప్పటి వరకు.. మిడ్జిల్ మండల అభివృద్ధికి రూ. కోటి 9 లక్షల నిధులు ఇచ్చాము అని అన్నారు. 

*అరుణమ్మ పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రశంసలు*


 నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ అరుణమ్మ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పార్టీ వేరైనప్పటికి అభివృద్ధి విషయంలో అరుణమ్మ సహకారం మరువలేనిదన్నారు. ఇప్పటికే ఎంపీ సహకారంతో నాసొంత మండలం రాజాపూర్ లో అదనపు తరగతి గదులు పూర్తి చేసుకున్నాం. ఇవాళ వస్ఫూలలో రూ. 27 లక్షల పిఎం శ్రీ నిధులతో ప్రారంభించడం సంతోషకరమన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ అరుణమ్మ సహకారంతో జడ్చర్లకు బైపాస్ తీసుకురాబోతున్నామని తెలిపారు. ట్రాఫిక్ రద్దిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల ఎంపీ అరుణమ్మ సహకారంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసి ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. ఇంతగా సహకరిస్తున్న ఎంపీ అరుణమ్మకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post