గ్రామీణ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పనుల జాతర ప్రారంభం....
పారిశుద్ధ్య కార్మికులు, హరిత సంరక్షకులకు సన్మానాలు
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి చిన్న ఓబులేష్..
నాగర్ కర్నూల్, ఆగస్టు 21 (మనఊరు ప్రతినిధి): జిల్లాలోనీ గ్రామాల్లో, క్షేత్రస్థాయి లో నూతన గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడి భవనాలు, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ద్వారా చేపట్టిన సెగ్రీగేషన్ షెడ్ , కమ్యూనిటీ శానిటరీకాంప్లెక్స్, ఇందిరా మహిళా శక్తి- ఉపాధి భరోసా క్రింద వ్యక్తిగత ఆస్తుల కల్పన పనులు అనగా కొట్టం, కోళ్ల షెడ్, గొర్రెల షెడ్,పండ్ల తోటలు,వానపాముల ఎరువుల తయారీ, అజోల పిట్ నిర్మాణం, జల నిధి" క్రింద వాననీటి సంరక్షణ- భూగర్భ జలాలు పెంచే ఫారం పాండ్స్, ఊట కుంటలు వంటి పనులకు ప్రారంభోత్సవాలు లేదా భూమి పూజలు పెద్ద ఎత్తున జాతర మాదిరిగా నిర్వహించనున్నారనీ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చిన్న ఓబులేష్ ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్రస్థాయిలోఉపాధి హామీ పథకంలో ఎక్కువ రోజులు పనిచేసిన కూలీలను, దివ్యాంగులను మరియు పారిశుద్ధ కార్మికులను, హరిత సంరక్షకులను ఈ సందర్భంగా సన్మానించనున్నారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి విభాగాల అధికారులు,ఉపాధి హామీ, స్వచ్ఛభారత్,ఆర్.డబ్ల్యు .ఎస్ పంచాయతీరాజ్ఇంజనీరింగ్, వాటర్ షెడ్ వంటి అన్ని విభాగాల అధికారులు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్నివిజయవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ బడవత్ సంతోష్ గారు ఆదేశించారాని తెలిపారు.అన్ని శాఖల అధికారులు కార్యక్రమాన్ని సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు.