విద్యార్థుల ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ....
6,196 విద్యార్థులకు మాత్రలు ...91.07శాతం కవరేజ్...
ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం వెంకట దాస్...
బిజినపల్లి, ఆగస్టు 11 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా నులిపురుగుల నివారణకువిద్యార్థులకు పంపిణీ చేస్తున్న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ సోమవారం నాడు నాగర్ కర్నూల్ డివిజన్ లో బిజినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.వెంకటదాస్ విద్యార్థులకు ఆల్బెండజోలు మాత్రలు విద్యార్థులకు వేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా చొరవ తీసుకొని నులి పురుగులు,ఏలిక పాములు, కొంకి పురుగులు నివారణ కు ఆల్బెండజోల్ మాత్రలు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. బిజినపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ ఎం.శివకుమార్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బిజినపల్లి పరిధిలో 6196 విద్యార్థులకు మాత్రలు 91.07శాతం,17 గ్రామాలలో 35 పాఠశాలలు 24 అంగన్వాడి కేంద్రాల్లో అరులైన విద్యార్థులు అందరికీ వేసినట్లు ఆయన తెలిపారు.లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ టి.ప్రసన్న మాట్లాడుతూ మంగనూరు, గంగారం, లట్టుపల్లి, ఎర్రకుంట తండా ఆరోగ్యం ఉప కేంద్ర పరిధిలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో అర్హులైన చిన్నారులందరికీ ఆల్బెండజోళ్ళు మాత్రలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ బి తేజస్విని, డాక్టర్ మేఘనా రెడ్డి, ఆరోగ్య విస్తీర్ణ అధికారి పి.రమేష్ కుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు అశోక్ కుమార్, బాలమణి, శశికళ, తామర , క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది, పాఠశాలల హెచ్ఎం లు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.