సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలి

 సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలి

బిజెపి మునిసిపల్ అధ్యక్షులు రామకృష్ణ

వడ్డేపల్లి, ఆగస్టు 2 (మనఊరు ప్రతినిధి): మునిసిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని బిజెపి మున్సిపాలిటీ అధ్యక్షులు బోయ రామకృష్ణ అన్నారు. శనివారం బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ వార్డల పర్యటనలో భాగంగా 9వ వార్డుకు వెళ్ళినప్పుడు మున్సిపాలిటీ పరిధిలోని రామచంద్రా నగర్ కాలనీలో 9వ వార్డులో సీసీ రోడ్లు సరిగ్గా లేక కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు డ్మ. సీసీ రోడ్లు లేక మురుగు కాలువలు లేక వర్షం నీరు రోడ్డు మీదనే నిలిచిపోతున్నాయి. కాలనీలో పశువులు తిరిగే చోట సీసీ రోడ్లు వేసి ప్రజలు తిరిగే చోట సీసీ రోడ్లు వేయలేదని వాపోతున్నారు. అందువలన చిన్నారులు , కాలనీ ప్రజలు నిత్యం డెంగీ మలేరియా వ్యాధులతో సతమతమవుతున్నారు. అలాగే విద్యుత్ కనెక్షన్లు సరిగ్గా లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీ కమిషనర్, విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు మోహన్ యాదవ్, శేఖర్ ఆచారి, జి.రవి, అయ్యరాజు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post