భారీ వర్షానికి నేలమట్టమైన ఇళ్లు

 భారీ వర్షానికి నేలమట్టమైన ఇళ్లు 

జడ్చర్ల రూరల్, ఆగస్టు 17 (మనఊరు ప్రతినిధి): మండలంలోని గంగాపూర్ లో శనివారం అర్ధ రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు నేలమట్టమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కురిసిన భారీ వర్షానికి ఓ పేద కుటుంబం ఆశ్రయాన్ని కోల్పోయింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకొంటుంది. ఇంటి యజమానురాలు రానామని సత్యమ్మ, సత్తయ్య, అలా కుటుంబ సభ్యులందరూ ఇంట్లో నిద్రిస్తుంటే. అకస్మాత్తుగా ఇళ్లు కూలిపోవడంతో కుటుంబ సభ్యులు భయపడి, బయటికి పరుగులు తీశారు. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం కారణంగా ఈ కుటుంబం ఆశ్రయాన్ని కోల్పోయింది. ఆహారదినుసులు వర్షానికి పాడైపోయాయి. అన్ని విధాలుగా నష్టపోయారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని కోరారు.

Previous Post Next Post