బైక్ చోరీ నిందుతున్ని పోలీసులకు అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది
జడ్చర్ల రూరల్, ఆగస్టు 19 (మనఊరు ప్రతినిధి): బైక్‌లు దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని ఆర్టీసీ సెక్యూరిటీ నరసింహులు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం కొత్త బస్టాండ్ క్యాంటీన్ ముందు బైక్ హ్యాండిల్ లాక్‌ను విరగ్గొట్టేందుకు యత్నిస్తుండగా సెక్యూరిటీ నర్సింహులు గమనించి లాక్ ఎందుకు విరగ్గొడుతున్నావని ప్రశ్నించారు. అయితే, బైక్ తనదే నంటూ.. తాళం పోయిందని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆయనకు అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం ఒప్పుకున్నారు. దీంతో బైక్ చోరీ నిందుతున్ని పోలీసులకు అప్పగించిన ఆర్టీసీ సెక్యూరిటీ నర్సింహులు తెలిపారు.