అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు
కల్వకుర్తి, ఆగస్టు 13 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని శ్రీమాతా పోచమ్మ విగ్రహ ప్రతిష్ట, బోనాల కార్యక్రమం సందర్భంగా బుధవారం శ్రీ మాత పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేకత పూజలు చేశారు. అనంతరం పోతురాజుల వేషధారణలో ఆటపాటలతో బోనాలను ఊరేగించారు. ప్రజలు బోనం ఎత్తుకొని గ్రామ దేవత పోచమ్మకు పట్టణంలోని వివిధ కాలనీలలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు ఆలయానికి తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. పట్టణంలోని వివిధ కాలనీలో పట్టణవాసులు పోచమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించి ముక్కులను తీర్చుకున్నారు. బోనాల వేడుకల్లో కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భావాండ్ల మధు, తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి నరసింహ, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్, మాజీ కౌన్సిలర్లు నూనె యాదమ్మ శ్రీనివాస్, సీనియర్ నాయకులు గుమ్మకొండ రాజు, తాళ్ల సురేష్ గౌడ్, రవి, నల్లవారి పల్లి వంశీ, అల్లుడు కృష్ణ, కేశవులు, వాహేద్, ఖాదర్, గుండియా నాయక్, యాదయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.