ప్రారంభమైన పనుల జాతర

 *పాపిరెడ్డిగూడలో పనుల జాతర ఘనంగా ప్రారంభం*

కేశంపేట, ఆగస్టు 23 (మనఊరు ప్రతినిధి): పనుల జాతరలో భాగంగా శనివారం మండల పరిధిలో పనుల- జాతర 2025 కార్యక్రమం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రమాదేవి పాపిరెడ్డి గూడ గ్రామంలోని రైతు కె. హనుమంతు పశువుల పాక షెడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా సంగేము గ్రామ పంచాయతీ పరిధిలో 10 శాతం భూమిలో డెన్స్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామపంచాయతీలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఉపాధి హామీ కింద కొత్త పనులు చేపట్టడమే కాకుండా, గ్రామ సభల ద్వారా గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ పనుల జాతర ద్వారా గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, రైతు సంక్షేమం లక్ష్యాల సాధనకు ప్రభుత్వ కట్టుబాటును మరోసారి స్పష్టంగా తెలియజేసిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి కిష్టయ్య, ఏపీవో అజీజ్, ఆయా పంచాయతీల కార్యదర్శులు, ఉపాధి హామీ కార్మికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Previous Post Next Post