గవర్నర్ చే డాక్టరేట్ పట్టా అందుకున్న సృజన వాహిని

 గవర్నర్ చే డాక్టరేట్ పట్టా అందుకున్న సృజన వాహిని

వనపర్తి, ఆగస్టు 19 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రానికి చెందిన నందిగామ సృజన వాహిని గవర్నర్ విష్ణుదేవ్ శర్మ, వైస్ ఛాన్సలర్ కుమార్ మోళుగరం చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కన్వొకేషన్ కార్యక్రమంలో నిర్వహించిన డాక్టరేట్ పట్టా పంపిణీ కార్యక్రమంలో ఆమె డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన నందిగామ యాదమ్మ శంకరయ్య దంపతుల కుమార్తె నందిగామ సృజన వాహిని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ పట్టా సాధించడం ఆనందంగా ఉందన్నారు. “మెటా మెటీరియల్ బేస్డ్ కాంపాక్ట్ ప్రింటెడ్ ఆంటెన్నాస్” అనే అంశంపై ప్రొఫెసర్ డి. రామకృష్ణ గారి పర్యవేక్షణలో పరిశోధన చేసి పిహెచ్డీ డిగ్రీ సాధించారు. పరిశోధన సమయంలో ఆర్ సి ఐ- డిఆర్ డి వో సంస్థలో “రాడార్ సీకర్” విభాగంలో ప్రొఫెసర్ పండరి పాండే మార్గదర్శకత్వంలో ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ పరిశోధన ఆసియా పసిఫిక్ మైక్రోవేవ్ కాన్ఫరెన్స్ (ఏపిఎంసి) – 2019, సింగపూర్ లో ప్రదర్శించబడిందన్నారు. అదేవిధంగా భారత ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ విభాగం ద్వారా మహిళా శాస్త్రవేత్త ఫెలోషిప్ అందుకుని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా ప్రాజెక్ట్ పూర్తి చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో 35కుపైగా పరిశోధనా పత్రాలు ప్రచురించడం విశేషం. పిహెచ్డీ చేసే అవకాశం కల్పించిన వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రోత్సాహం అందించిన భర్త కరణం నరేష్, మిత్రుడు డా. భరత్ కుమార్, కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సృజన వాహిని మాత్ వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్ఎప్ టూల్ బాక్స్ డెవలాపర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన 84 కన్వికేషన్ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణలచే గౌరవ డాక్టరేట్ పొట్ట అందుకున్నట్టు తెలిపారు. గ్రామానికి చెందిన పోతుల కృష్ణారెడ్డి లక్ష్మీదేవమ్మ దంపతులకు చెందిన వెంకటేష్ రెడ్డి గోపాల్ పేట ప్రాంతంలో విద్యను అభ్యసించానని డాక్టర్ రేట్ అందుకున్నందుకు తల్లిదండ్రులకు కృత్యం తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం బీసీ ఆ కుమార్ ప్రొఫెసర్లు విద్యార్థులు పాల్గొన్నారు.



Previous Post Next Post