బాలానగర్ లో బ్రహ్మకమలం పువ్వుల సందడి
బాలానగర్ మండల కేంద్రానికి చెందిన అల్లాపురం రామ్ రెడ్డి పున్నమ్మ దంపతుల ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు పెంచుతుండగా.. అందులో బ్రహ్మకమలం పూలు పూయడంతో దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
బాలానగర్, ఆగస్టు 13 (మనఊరు ప్రతినిధి): మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రానికి చెందిన అల్లాపురం రామ్ రెడ్డి పున్నమ్మ దంపతుల ఇంట్లో ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు బ్రహ్మకమలం పువ్వులు వికసించాయి. బుధవారం ఉదయం చెట్టుకు ఐదు బ్రహ్మకమలం పువ్వులు వికసించాయి. అరుదుగా పూసే ఈ బ్రహ్మకమలం పువ్వులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూస్తాయి. బాలానగర్ మండల కేంద్రానికి చెందిన అల్లాపురం రామ్ రెడ్డి పున్నమ్మ దంపతుల ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు పెంచుతుండగా.. అందులో బ్రహ్మకమలం పూలు పూయడంతో దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ బ్రహ్మకమలం పూలు మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పూసి తర్వాత ఉండవని ప్రకటించారు. కాగా చాలా తక్కువగా చిగురించే బ్రహ్మకమలం పూలు.. అందులో ఒకేసారి ఐదు బ్రహ్మకమలం పూలు చిగురించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. వాటికి ప్రత్యేక పూజలు చేశారు.