ప్రభుత్వ ఆసుపత్రిలో వినాయక చవితి పూజ

 

ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఘనంగా గణపతి పూజలు....

విఘ్న రహిత ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి....

మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి

నాగర్ కర్నూల్, ఆగస్టు 27 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని సాధారణ ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదాయబద్దంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. విఘ్నాలు లేకుండా దైవ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ విశ్వవాసు సంవత్సరం భద్రపద మాస శుక్ల చవితి వినాయక చవితి పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా రాష్ట్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో బుధవారం గణపతి పూజలు ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ దృష్ట్యా, ప్రకృతి వికృత రూపం దాల్చకుండా ప్రజా ఆరోగ్యాన్ని, ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడాలని ఆమె భగవంతుని నిర్దిష్టంగా. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.ఓ డాక్టర్ ఏ.రోహిత్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పి.పూర్ణిమ, జనరల్ సర్జన్ డాక్టర్ రాజేష్, నర్సింగ్ ఎం.ఆనంద్ కుమార్, ఏం.కిరణ్, అధికారులు ఆంజనేయులు, మన్మోహన్ రెడ్డి, కేశవ్, సునీత, వెంకటేశ్వరీ, చెన్నమ్మ, పలు విభాగాల్లో నర్సింగ్ అధికారులు, వైద్య సిబ్బంది, పని చేశారు.





Previous Post Next Post