టీయూడబ్ల్యూజేతోనే జర్నలిస్టులకు న్యాయం..
ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్
మహాసభను అద్భుతంగా నిర్వహించాలి
- కమిట్మెంట్ తో పనిచేయాలి
- మహబూబ్ నగర్ జిల్లా మహాసభ సన్నాహక సమావేశం
మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్మహబూబ్నగర్ ఆగస్టు 22 )మనఊరు ప్రతినిధి): సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న సంఘం టీయూడబ్ల్యూజేనే నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం, మీడియా స్వేచ్ఛ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డిసిసిబి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మహాసభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సంఘంతోనే మీకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకం జర్నలిస్టుల్లో. ఇప్పటికే అనేక మంది జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తూ కుటుంబాలకు అండగా ఉన్నామన్నారు. అతి త్వరలో నిర్వహించే మహబూబ్ నగర్ జిల్లా టియుడబ్ల్యూజేఐజేయు మహాసభను అద్భుతంగా నిర్వహించాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మరియు మహబూబ్ నగర్ యూనియన్ అభివృద్ధి కోసం పాటుపడి కమిట్‌మెంట్‌తో పని చేసేవారికి యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేసే ఏకైక యూనియన్ ఐజేయు అని స్పష్టం చేశారు. అవసరం అనుకుంటే ప్రభుత్వంతో కొట్లాడి, ఒప్పించి, మెప్పించి జర్నలిస్టుల సంక్షేమానికి పాటు పడతామని స్పష్టం చేశారు. జర్నలిజంలో విలువలను కాపాడాలని, అలాంటి వారికే భవిష్యత్తు ఉంటుందని యూఎన్‌లో కూడా పదిలంగా ఉంటుందని చెప్పారు. యూనియన్ లో ఉన్న ప్రతి సభ్యుడు తోటి జర్నలిస్టులకు ఆపదలో ఉన్న సభ్యులకు ఎంత సేవ చేస్తే అంత గుర్తింపు వస్తుంది. యూనియన్ బయట చలామణి అయ్యే వారికి ఇతర కార్యక్రమాలు చేసే యూనియన్ లో స్థానం ఉండదని, వారికి అనుమతి కూడా రద్దు పేరుతో తేల్చి చెప్పారు. యూనియన్‌లో కొనసాగుతూ యూనియన్ మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటారు.
నూతన కమిటీ ఎంపిక..
జిల్లా మహాసభ విజయవంతానికి కన్వీనర్ కెఏ విజయ రాజుతో పాటు ఎన్ సతీష్ కుమార్ రెడ్డి, నరేందర్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, పవన్ కుమార్ రెడ్డి , భాస్కర్ రావు, మల్లు మధుసూదన్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, పేట వెంకటయ్య, గొడుగు వెంకటయ్యతో కలిసి పదిమంది సభ్యులతో కూడిన జిల్లా సమన్వయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో సమావేశాల సందర్భంగా ఏర్పాటుచేసిన జిల్లా అడ్ హక్ కమిటీని ఈ సందర్భంగా రద్దు చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టుల హౌస్ సైట్ కమిటీ శ్రీనివాస్ సభ్యుడు, సీనియర్ జర్నలిస్టులు ఐల మౌని శేఖర్, ముజీబ్, రవీందర్ గౌడ్, సుదర్శన్, స్థానిక అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున సభ్యులు తరలివచ్చారు.