అన్నిదానాల కంటే రక్తదానం గొప్పది

 అన్నిదానాల కంటే రక్తదానం గొప్పది

మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి 

జడ్చర్ల, ఆగస్టు 22 (మనఊరు ప్రతినిధి): అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్పదని, రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయటమే అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని వాసవి క్లబ్, వనిత వాసవి క్లబ్, జడ్చర్ల, శ్రీ సత్యేశ్వర సేవా ఆశ్రమం, బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో సోదర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఓం శాంతి, దాజీ జ్ఞాపకార్థం సందర్భంగా బ్రహ్మకుమారి రాజయోగ కేంద్రం వద్ద రక్తదాన శిబిర కార్యక్రమానికి ఆయన హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న వారందరూ రక్తదానం చేయవచ్చని, రక్తదానం చేయడంతో వేరోకరి ప్రాణాలను నిలబెట్టవచ్చన్నారు. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, అవసరమైనప్పుడు రక్తదానం చేయాలన్నారు. నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, థలసీమియా వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరమని, అలాంటి వారిని కాపాడేందుకు రక్తదానం చేయడం అవసరం అన్నారు. రక్తం దానం చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో 38 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి, శ్రీసత్యేశ్వరా సేవా ఆశ్రమ నిర్వాహకులు, వాసవి క్లబ్ అధ్యక్షులు చిత్తనూరి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, దేవరాజ్, యెచ్చం నవీన్, మేడిశెట్టి రామకృష్ణ, కొండూరి వెంకటేష్, కండె కృష్ణ, ఓం శాంతి ఆశ్రమ నిర్వాహకులు సుజ్ఞాని, ప్రభ, రాఘవులు, వినయ్, నాయకులు పాలాది రామ్మోహన్, కొడుగల్ యాదయ్య, శ్రీ శైలం యాదవ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.













Previous Post Next Post