లట్టుపల్లిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..
బిజినపల్లి, ఆగస్టు 15 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర వీరుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛావాయువులని, వారిని స్మరిస్తూ ఆరోగ్య సేవలో ఉండాలని అన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జాతీయ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మేఘనా రెడ్డి, డాక్టర్ తేజస్విని, ఆరోగ్య సిబ్బంది అబ్దుల్ సలీం తదితరులు పాల్గొన్నారు.