హలో బిసి చలో ఢిల్లీ పోస్టర్ల ఆవిష్కరణ

 *హలో బిసి చలో ఢిల్లీ పోస్టర్ల ఆవిష్కరణ* 

 *జాతీయ బిసి సంక్షేమ సంఘం*

ఎర్రగుంట్ల, 15, (మన ఊరు ప్రతినిధి):జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఆగస్టు అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య సారధ్యంలో రాష్ట్ర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు, రాష్ట్ర ఇంచార్జి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వెలగల నూకాలమ్మ ఆదేశానుసారం కడప జిల్లా యర్రగుంట్ల పట్టణంలో శుక్రవారం యర్రగుంట్ల బిసి సంక్షేమ సంఘం నాయకులు చంద్రగిరి రెడ్డయ్య, సాకె. రాధాకృష్ణ, బెస్త లక్మి నారాయణ, యస్. బాబు, డి. శ్రీనివాసులు హలో బిసి చేలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్లను విడుదల చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 18,19 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దేశం మరియు రాష్ట్ర జనాభాలో మేమెంతో మాకంత అంటూ జరుగబోవు బిసి మహా ధర్నాకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున బిసిలు తరలి రావాలని నిర్ణయించారు. మనకు శ్వాతం వచ్చి 79 సంవత్సరాలుగా కూడా డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం బిసిలకు రావలసిన వాటాలు ఇప్పటికి రాకుండా అడ్డుపడుతున్న కొన్ని వర్గాలకు దీటుగా మనం కూడా రాజకీయంగా ఎదగాలంటే మనకు రావలసినది వాటాల కొరకు మన బీసీలు ఐకమత్యంతో పోరాడవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు. బిసిలను అగ్ర స్థానంలో నిలుపుతామణి బిసిలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తామని ఎన్నికల సమయాల్లో పార్టీలు వాగ్దానాలు చేస్తూ ప్రభుత్వంలోకి వస్తూనే బిసిలను మభ్యపెడుతున్నారు. పెడుతూ బిసిల ఓట్లు కొల్లగొడుతున్నాయి తప్ప బిసి జనాభాకు తగ్గట్టు వారి పార్టీలలో కూడా సముచిత స్థానం కల్పించడం లేదు. బిసిలకు ఇచ్చిన వాగ్దానాలు మరచి ప్రవర్తిస్తున్నాయని వారున్నారు. ఇప్పటికైనా పార్టీలు మొల్కొని బిసిలకు ఇచ్చిన వాగ్దానాలు నేటికి నెరవేర్చి వారికి న్యాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు

Previous Post Next Post