ఘనంగా పోచమ్మ బోనాలు
కేశంపేట, ఆగస్టు 19 (మనఊరు ప్రతినిధి): మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామంలో మంగళవారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అంబేద్కర్ కాలనీ వాసులు, మహిళలు పాడి పంట, కుటుంబాలను చల్లగా చూడాలని, సమృద్ధిగా వర్షాలు కురువాలని, సమాజం ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి తమను చల్లగా కాపాడమని దేవతను వేడుకున్నారు.