ప్రతి ఒక్కరికి జీవిత బీమ ద్వారా ఆర్థిక రక్షణ కల్పించాలి

 ప్రతి ఒక్కరికి జీవిత బీమ ద్వారా ఆర్థిక రక్షణ కల్పించాలి 

కేశంపేట మండలాన్ని ఆదర్శంగా నిలపాలి

ఆ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక పాలసీ ఖచ్చితంగా చేయాలి

అందుకు ఎల్ఐసి కుటుంబ సభ్యులందరూ కృషి చేయాలి

( పైలెట్ ప్రాజెక్ట్ క్రింద కేశంపేట మండలం ఎంపిక)

ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జడ్చర్ల ఎల్ఐసి బ్రాంచి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో 

ఎల్ఐసి ఆల్ ఇండియా క్లియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిసి.పైక్రే 

జడ్చర్ల, సెప్టెంబరు 3 (మనఊరు ప్రతినిధి): దేశంలోని ప్రతి ఒక్కరికి జీవిత బీమ ద్వారా రక్షణ కల్పించి వారికి ఆర్థిక భద్రతను ఇవ్వడమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దే శ్యం అని ఎల్ఐసి ఆఫ్ ఇండియా ముంబై సెంట్రల్ ఆఫీస్ క్లియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిసి.పైక్రే అన్నారు. జడ్చర్ల ఎల్ఐసి బ్రాంచ్ పరిధిలోకి వచ్చే కేశంపేట మండలాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో పైలెట్ ప్రాజెక్టుగా ఎల్ఐసి ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని బ్రాంచ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పైక్రే మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికి బీమ సదుపాయం కల్పించాలనే సంకల్పంతోనే 1956వ సంవత్సరం ఆనాటి కేంద్ర ప్రభుత్వం జీవిత బీమ సంస్థను ప్రారంభించిందని తెలిపారు. జీవిత బీమ సంస్థ ఎంతగానో విస్తరించినా ఇంకా దేశంలోని అందరికీ ఎల్ఐసి పాలసీలను అందించలేక పోయిందని, అందువల్లనే వినూత్న రీతిలో కేశంపేట మండలాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి " ప్రతి ఇంట్లో ఒక పాలసీ " నినాదంతో ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ప్రాజెక్టు విజయవంతానికి ఎల్ఐసి కుటుంబ సభ్యులందరూ విశేషంగా కృషి చేసి ఆ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. ఎల్ఐసి ద్వారా జీవిత బీమ పొందడం తరతరాలకు పనికి వస్తుందని, అందువల్ల ప్రజలకు ఆ విషయం గురించి స్పష్టంగా తెలియజేసి ఎల్ఐసి సంస్థ నిర్దేశించినట్లుగా 2026 మార్చి 26వ తేది నాటికి అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆయన కోరారు. ప్రాజెక్టు విజయవంతం తర్వాత ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ దొరై స్వామిచే విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని ఆయన అన్నారు. ఎల్ఐసి హైదరాబాద్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ మాట్లాడుతూ ఎల్ఐసి సంస్థ మన జోన్ లోని కేశంపేట మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం మన ప్రాంత ప్రజల అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అందరికీ ఎల్ఐసి పాలసీలు అందించిన వారమవుతామని ఆయన అభిప్రాయపడ్డారు. ఎల్ఐసి హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ సంధ్యారాణి మాట్లాడుతూ జడ్చర్ల బ్రాంచి ఏజెంట్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు కలిసికట్టుగా పైలెట్ ప్రాజెక్టు విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేశంపేట మండలాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా మండలాల్లో కూడా అదేవిధంగా పాలసీలు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. బీమ గ్రామ్, బీమ స్కూల్ లాంటి వాటి ద్వారా చేకూరే ప్రయోజనాలను గురించి గ్రామాలలోని

ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అవగాహన కల్పించి తద్వారా పాలసీలు చేయాలని ఆమె సూచించారు. జీవిత బీమా ప్రాముఖ్యత తెలిసినప్పుడే ప్రజలు పాలసీలు చేసుకోవడానికి ముందుకు వస్తారని అందువల్ల వారికి దాని ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను గురించి స్పష్టంగా తెలియజేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి క్లియా ఆర్ఎం రాజశేఖర్, ఎంఎం. ప్రసాద్ రావు, క్లియా మేనేజర్ రవిశంకర్, బిడిబిఎస్ మేనేజర్ జగన్నాథం, జడ్చర్ల బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఎల్.శంకర్ నాయక్, షాద్ నగర్ ఎస్ఓ మేనేజర్ పణి భూషణ్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సేల్స్ రవీందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post