కంటి శిబిరంలో 23 మందికి కంటి క్యాటరెక్ట్ ఆ
74 మందికి సాధారణ కంటి వైద్య పరీక్షలు
నాగర్ కర్నూల్, నవంబరు 27 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ వారి ఆధ్వర్యంలో గురువారం నాడు పాత కలెక్టరేట్ భవనం 102 గది లో నిర్వహించిన కంటి చికిత్స శిబిరం విజయవంతమైనట్లు నాగర్ కర్నూల్ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చింతపట్ల నీరజ్ కుమార్ తెలిపారు. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు తరచుగా చేసుకోవాలని ఆయన సూచించారు.కంటి ఆరోగ్యం కాపాడుటలో ప్రతి ఒక్కరూ విటమిన్ ఏ కలిగిన పోషక ఆహారాన్ని అధిక మొత్తంలో తీసుకోవాలని సూచించారు.ఈ శిబిరంలో జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 74 మందికి కంటి పరీక్షలు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి శిబిరాలను జిల్లా ప్రజలు అధిక మొత్తంలో వినియోగించు కోవాలని ఆయన కోరారు. శిబిరంలో కంటి పరీక్షలు 74మందికి నిర్వహించగా, అందులో అర్హులైన క్యాటరాక్ట్ పొరగల 23మందిని గుర్తించి ప్రత్యేక అంబులెన్స్ వాహనంలో లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి పంపినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేత్రాధికారి కొట్ర బాలాజీ, వై.శ్రీనివాసులు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, నరసింహ, చెన్నకేశవులు, ప్రకాష్ రోగులు తదితరులు పాల్గొన్నారు.

