జడ్చర్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం
జడ్చర్ల, నవంబర్ 7 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల పట్టణ పరిధిలోని 11 కేవీ ఫీడర్లపై చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈనెల 8 తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 11 కేవీ సిగ్నల్ గడ్డ ఫీడర్, బాదేపల్లి సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ నిలిపి వేయు సమయం: ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఈ సమయంలో విద్యుత్ లేకుండ रहने ప్రాంతాలు వెంకటేశ్వర కాలనీ, గౌరీశంకర్ కాలనీ, కల్వకుర్తి రోడ్, సాయి నగర్ కాలనీ, శ్రీనివాస నగర్ కాలనీ, సిగ్నల్ గడ్డ, బోయిలకుంట రోడ్, నేతాజీ చౌక్, 11 కేవీ బాదేపల్లి ఫీడర్, బాదేపల్లి సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ నిలిపి వేయు సమయం మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు
ఈ సమయంలో విద్యుత్ లేకుండ ప్రాంతాలు మార్కెట్ యార్డ్, ఆర్.కే. గార్డెన్స్, నిమ్మబాయి గడ్డ, శివాజీ నగర్, బాదేపల్లి, ఫిరోజ్ నగర్, ఈ విద్యుత్ నిలిపివేత పనులు చెట్ల కొమ్మలు ట్రాన్స్‌మిషన్ లైన్లకు ఆటంకం కలిగించకుండా, భద్రతా కారణాల రీత్యా నిర్వహించబడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.
.jpg)