సాహిత్య సేవలో మరొక అడుగు అంజనీ కుమారి

 సాహిత్య సేవలో మరొక అడుగు పి.వి.పి. అంజనీ కుమారి

విశ్వ సాహితీ కళావేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పి.వి.పి. అంజనీ కుమారి

హైదరాబాద్, నవంబరు 7 (మనఊరు ప్రతినిధి): జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా ఉద్యమాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిన విశ్వ సాహితీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ప్రముఖ కవయిత్రి, సామాజిక సేవకురాలు, అభ్యుదయవాది పి.వి.పి. అంజనీ కుమారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా విశ్వ సాహితీ కళావేదిక టీం ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సాహిత్యం ద్వారా సమాజానికి సేవ చేయడం, మహిళా సాధికారత కోసం కృషి చేయడం, సాంస్కృతిక విలువల పరిరక్షణలో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంజనీ కుమారి మాట్లాడుతూ సాహిత్యం మనసులను కలుపుతుంది. కళ, సంస్కృతి, సాహిత్యం ద్వారా మానవతా విలువలు పెంపొందించడం నా లక్ష్యం అన్నారు. ఈ బాధ్యతను నిబద్ధతతో, సేవాభావంతో నిర్వర్తిస్తాను అని అన్నారు.

Previous Post Next Post