నవాబుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కోసం జెకె ట్రస్ట్ డైరెక్టర్
ఊరుకొండ గీతారాణి
ఐదవ వార్డు మెంబర్ స్థానానికి ట్రస్ట్ చైర్మన్ ఊరుకొండ నర్సింహ చారిలు నామినేషన్లు దాఖలు
వారి గెలుపు ఖాయం అంటున్న గ్రామ ప్రజలు
వారి గెలుపుకు వారి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలే కారణంగా నిలుస్తాయని గ్రామస్తుల అభిప్రాయం
నవాబుపేట, నవంబరు 27 (మనఊరు ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వచ్చేనెల 11వ తేదీన మొదటి విడతలో జరుగబోయే గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి మొదటి రోజు యువత అత్యంత ఆసక్తిని కనబరిచారు. గురువారం మంచి ముహూర్తం ఉండడంతో పోటీ చేసేవారు తమ నామినేషన్ పత్రాలను సాదాసీదాగా వచ్చి దాఖలు చేశారు. నవాబుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కోసం చాలా కాలంగా నవాబుపేట గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ ప్రజల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్న జెకె ట్రస్ట్ డైరెక్టర్ శ్రీమతి ఊరుకొండ గీతారాణి అదే గ్రామ పంచాయతీ ఐదవ వార్డ్ మెంబర్ స్థానానికి జెకె ట్రస్ట్ చైర్మన్ ఊరుకొండ నరసింహ చారిలు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు దాఖలు చేశారు. జెకె ట్రస్ట్ ద్వారా వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు అత్యంత చేరువైన ఊరుకొండ నరసింహ చారి కుటుంబ సభ్యులు రాజకీయంగా తమ సేవలను గ్రామ ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో ప్రజల ఆదరాభిమానాలతో పోటీలో నిలిచారు. వారు తమ సేవా కార్యక్రమాలతో గ్రామ ప్రజలకు ఎంతో సన్నిహితులయ్యారు. గ్రామ ప్రజలకు ఏ కష్ట నష్టం వచ్చినా ఎల్లవేళలా నా తోడు నీడగా ఉంటూ వారు ప్రజల ఆదరాభిమానాలను ఇప్పటికే విశేషంగా చురగొన్నారు. ఈ ఎన్నికలలో పోటీదారులు ఎవరైనా కూడా వారి గెలుపు తథ్యమనే అందరూ భావిస్తున్నారు.
కాగా రియల్ బూమ్ కారణంగా మండలంలో ఆర్థికంగా బలపడిన అనేక మంది యువత ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. తాము రాజకీయాలలో రాణించేందుకు గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్ స్థానం నుండి పోటీ చేసేందుకు యువ అభ్యర్థులు అత్యంత ఆసక్తిని కనబరిచారు. వారు తమ పాలకవర్గం కూడా తమ సమ వయస్కులే ఉండేలా వార్డు మెంబర్ అభ్యర్థులను సైతం ఎన్నికల బరిలో నిలుపుతూ వారితో కూడా నామినేషన్లు దాఖలు చేయిస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించడంతోపాటు ఏర్పాటు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదటి రోజు సవ్యంగా జరగడంతో అటు అధికారులు, ఇటు రాజకీయ పార్టీల నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
