మున్సిపల్ కార్మికుడు దుర్మరణం

కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం

చెట్లకు నీళ్లు పోస్తున్న మున్సిపల్ కార్మికుడు దుర్మరణం

కూకట్‌పల్లి, హైదరాబాద్‌, నవంబరు 29 (మనఊరు ప్రతినిధి): కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీళ్లు పోస్తున్న మున్సిపల్‌ కార్మికుడిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఘటనలో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Previous Post Next Post