ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైతే ఆ గ్రామానికి రూ.20 లక్షల భరోసా
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హామీ
వనపర్తి, నవంబరు 29 (మనఊరు ప్రతినిధి): మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కీలక నిర్ణయం. ఏ గ్రామం ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుంటే ఆ గ్రామానికి తన ఎస్‌డిఎఫ్ నిధుల నుంచి రూ.20 లక్షలు చేస్తానని చెప్పారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధి దృష్ట్యా ప్రజలు, గ్రామ పెద్దలు పరస్పరం ఏకాభిప్రాయంతో పంచాయతీని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఏకగ్రీవం ద్వారా గ్రామాల్లో శాంతి, సౌహార్దం నెలకొని, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని మేఘారెడ్డి భరోసా ఇచ్చారు.
