ఎక్స్ కవేటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

 ఎక్స్ కవేటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల రూరల్, నవంబరు 7 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మునిసిపల్ పరిధిలో మురుగు, పట్టణాభివృద్ధి పనుల కోసం నూతనంగా కొనుగోలు చేసిన ఎక్స్కవేటర్ వాహనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. మునిసిపల్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధి, శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపర్చడంలో మునిసిపాలిటీ మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలను అందించడానికి ఆధునిక యంత్రాలు, పరికరాల వినియోగం చాలా అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జి. లక్ష్మా రెడ్డి, చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, వైస్ చైర్‌పర్సన్ పాలాది సారిక, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






Previous Post Next Post