రూ.2 కోట్లతో రాజాపూర్ ను అభివృద్ధి చేస్తా
మా సొంత పొలాన్ని రాసిస్తా
బీరప్ప పండగ ఘనంగా జరుపుకుందాం
స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ కట్టిస్తా
గోనెల రమేష్ ను గెలిపించండి
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
రాజాపూర్, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతోంది. దీంతో తనదారులను గ్రామాలలో సర్పంచిగా నిలబెట్టి ప్రతి ఒక్కరు కైవసం చేసుకోవాలని జోరు మీద కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రధానంగా రాజాపూర్ మండలంలో సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు. తన సొంత రాజాపూర్ లోని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేలా ప్రతి మండలం వినియోగించుకుంటున్నారు. ఆ దూకుడుతో మండలంలో విస్తృత పర్యటనలు చేస్తూ.. ప్రతిపక్ష పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. స్థానిక ఎన్నికలలో భాగంగా రాజాపూర్ మండలంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గోనెల రమేష్ తో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రాజాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గోనెల రమేష్ ను కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఆయన ఓటర్లను గెలిపించాలని. రమేష్ ను గెలిపిస్తే రాజాపూర్ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు,రూ.2 కోట్ల నిధులతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.మూడ నిధులతో రాజాపూర్ గ్రామంలో రూ.1.70 కోట్లతో రోడ్లు డ్రైనేజీలు కంప్లీట్ చేశానని అన్నారు.అదేవిధంగా స్కూల్ కాంపౌండ్ వాల్ కు రూ.30 లక్షలు ఇచ్చినట్టు చేశారు.తను ఎమ్మెల్యే కాకముందు 8 బోర్లు వేయించినట్లు గుర్తు చేశారు. అదేవిధంగా ఉన్న సంఘం సమీపంలోని స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ కట్టిస్తారని హామీ ఇచ్చారు.రాబోయే రెండు సంవత్సరాల్లో మరో రూ.2 కోట్ల నిధులతో రాజాపూర్ ను అభివృద్ధి చేస్తానని అన్నారు.ఎమ్మార్వో ఎంపీడీవో పోలీస్ స్టేషన్లో అద్దె భావనలు ఉన్నాయని అన్నారు.గత పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుంది అన్నారు. ప్రజలకు సన్న బియ్యం కార్డులు ఇచ్చామని, అదేవిధంగా 35 మంది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని తెలిపారు.రమేష్ కోరిక మేరకు మరో 50 ఇళ్లు రాజాపూర్ గ్రామానికి చెందిన చేస్తానని హామీ ఇచ్చారు.తెల్ల రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. బిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థి లేడ అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని ప్రశ్నించారు.రమేష్ కాంగ్రెస్ పార్టీ మరి ఆపోజిట్ అభ్యర్థి ఏ పార్టీనో బిఆర్ఎస్ వాళ్ళు అని చెప్పు అన్నారు.






