ఎన్నికల వేళ బస్టాండ్‌లో బస్సుల బంద్!

ఎన్నికల వేళ బస్టాండ్‌లో బస్సుల బంద్!

మహబూబ్‌నగర్‌లో ప్రయాణికుల అవస్థలు


మహబూబ్‌నగర్, డిసెంబరు 13 (మనఊరు ప్రతినిధి): రెండో విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర బస్టాండ్‌లో బస్సుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ఎన్నికల విధుల్లో భాగంగా పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను అధికారులు వినియోగించడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులు సకాలంలో రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పండుగ సీజన్ కావడంతో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో బస్సుల కొరత సమస్య మరింత తీవ్రమైంది. కొన్ని రూట్లలో బస్సులు పూర్తిగా రద్దు కాగా, మరికొన్ని రూట్లలో పరిమిత సంఖ్యలోనే సర్వీసులు నడుస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణతో పాటు ప్రజా రవాణాపై కూడా అధికారులు సమానంగా దృష్టి పెట్టాలని, కనీసం అదనపు సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. 




Previous Post Next Post