ఘనంగా జడ్చర్లలో పాస్టర్స్ క్రిస్మస్ సంబరాలు
జడ్చర్ల, డిసెంబరు 9 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల నియోజకవర్గ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జడ్చర్ల పట్టణంలోని సెంటినరీ ఎం.బి. చర్చిలో క్రిస్మస్ సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పాస్టర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన రెవరెండ్ డాక్టర్ జీవరత్నం ప్రధాన అతిథిగా హాజరై క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ప్రత్యేక గీతాలాపన, బైబిల్ ధ్యానం, ప్రార్థనలు నిర్వహించగా అనంతరం క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. దేశ రాష్ట్రాల శాంతి, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ కే. విలియం బూత్, కార్యదర్శి డి. సువార్త రాజ్, కోశాధికారి నాతాన్, రవిబాబు, స్టీవెన్ రాజ్, ఏలియా, రత్నం, ప్రకాశ్, ఆశీర్వాదం, జాన్, భాస్కర్, పరంజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

