ఘనంగా సోనియా గాంధీ జయంతి వేడుకలు

 ఘనంగా సోనియా గాంధీ జయంతి వేడుకలు 

జడ్చర్ల రూరల్, డిసెంబరు 9 (మనఊరు ప్రతినిధి): పట్టణంలో సోనియా గాంధీ 79వ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, సోనియా గాంధీ సేవా భావం, సామాజిక నిబద్ధత గురించి ఆయన వెల్లడించారు. పేదల కోసం ఆమె అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పటచటణ అధ్యక్షులు మీనాజోద్దీన్, కౌన్సిలర్లు కుమ్మరి రాజు, రమేష్, మాజీ సర్పంచ్ వెంకటేష్, నాయకులు కోనేటి నరసింహులు, చాగంటి రఘు, అనిల్, వంశి, మాజీ వార్డు మెంబర్ భాస్కర్ రెడ్డి, బెన్నీ, మాజీ ఎంపీటీసీ లక్ష్మమ్మ, ఎర్ర ఆనంద్, అనుప కృష్ణయ్య, తుంగ రఘు, శ్యామ్, కృష్ణారావు, ఆసిఫ్, కృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post